అయోధ్య రామ మందిరం.. ఆసక్తికర విషయాలు. 

20 January 2024

TV9 Telugu

ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2020 ఆగస్టు 5వ తేదీన రామ మందిరానికి శంకుస్థాపన జరిగింది. 

అయోధ్య రామ మందిరాన్ని 2.7 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ నిర్వహిస్తోంది. 

గర్భగుడిలో కొలువుదీరనున్న బాల రాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తుతో ఉండనుంది. అయిదేళ్ల వయసులో ఉన్న రాముడు గర్భ గుడిలో దర్శనమివ్వనున్నారు. 

అయోధ్య రామయ్యకు వడోదరకు చెందిన భక్తులు 108 అడుగుల అగరుబత్తిని బహుకరించారు. 3,610 కిలోల బరువున్న ఈ అగరుబత్తి ధర అక్షరాల రూ. 5 లక్షలు. 

ఇక హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం, అయోధ్య శ్రీరాముడి కోసం ఏకంగా 1265 కిలోల భారీ లడ్డుని తయారు చేసి పంపించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయోధ్యకు ఏకంగా లక్ష లడ్డూలను పంపించారు. వీటి తయారీలో 350 మంది సిబ్బంది పాల్గొన్నారు.

సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌ అనే చేనేత కార్మికుడు ప్రత్యేకంగా చీరను పంపించారు. ఇందుకోసం 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఉపయోగించారు. 

ఇక అయోధ్య రామాలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత.. ఆలయ నిర్మాణానికి కాంక్రీట్ కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. కేవలం రాళ్లతోనే ఆలయాన్ని నిర్మించడం విశేషం.