08 September 2023

వెహికిల్ ఇన్సూరెన్స్ లో నిర్లక్ష్యం చూపిస్తే.. తరువాత ఏమీ మిగలదు

బైక్, కార్ ఇలా ఏదైనా వెహికిల్ కి ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే, చాలామంది వెహికల్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు.

మన దేశంలో చాలావరకూ వెహికల్ ఇన్సూరెన్స్ ఎక్స్ పైర్ అయిన తరువాత రెన్యూవల్ చేయించడంలో అశ్రద్ధ చూపిస్తారు. 

ఇలా ఎక్స్ పైర్ అయిన ఇన్సూరెన్స్ పాలసీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు గ్రేస్ పిరియడ్ ఇస్తాయి.

అంటే, ఇన్సూరెన్స్ టైం అయిపోయిన తరువాత కొన్ని రోజుల పాటు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే అవకాశం ఇస్తాయి.

ఈలోపు రెన్యువల్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ అది కూడా దాటిపోతే ఇబ్బంది తప్పదు .

ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం వెహికల్ చెక్ చేయాలని కంపెనీలు కోరవచ్చు. లేదా మీ వెహికల్ ఫోటో పంపమని అడగవచ్చు. 

ఇక ఇలా గ్రేస్ పిరియడ్ లోపు రెన్యువల్ చేయించుకుంటే కనుక నో క్లెయిం బోనస్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీని అడిగే అవకాశం ఉంటుంది. 

అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు మీ ఇన్సూరెన్స్ రెన్యువల్ పై కొంత డిస్కౌంట్ ఇస్తాయి. వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం తప్పనిసరి అని మర్చిపోవద్దు.

అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వలన ఉపయోగం ఎక్కువ అని గుర్తుంచుకోండి.