మీకు తెలుసా.. ఇంతకుముందు ఎర్రకోట ఏ రంగులో ఉండేదో..?
21 December 2023
TV9 Telugu
భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎన్నో అందమైన, చారిత్రక కట్టడాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదకుండా ఉన్నాయి.
ఢిల్లీలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో ఒకటైన ఎర్రకోట మాత్రం అక్కడ ఉన్న అన్ని భవనాల కంటే భిన్నంగా ఉంటుంది.
భారతదేశ స్వర్ణయుగానికి సాక్ష్యమిచ్చే ప్రదేశంలో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉన్న ఎర్రకోటను నిర్మించారు.
ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని తెలిసిందే.
మీకు తెలుసా, ఇంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఎరుపు రంగులో కాకుండా, తెలుపు రంగులో ఉండేదని.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట అసలు పేరు ఖిలా-ఎ-ముబారక్. ఎర్ర కోటలోని అనేక భాగాలు సున్నపురాయితో నిర్మించారు.
ఖిలా-ఎ-ముబారక్ కోటను ముందు దీని రంగు తెల్లగా ఉండేది. కొన్నేళ్ల తర్వాత గోడలపై ఉన్న సున్నపురాయి చెడిపోవడం మొదలైంది.
సున్నపురాయి చెడిపోవడంతో బ్రిటీష్ కాలంలో ఈ కోటకు ఎరుపు రంగు వేశారు. అప్పటి నుంచి దానికి ఎర్రకోట అని పేరు పెట్టారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి