కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ సంపద ఎంతో తెలుసా?
Prudvi Battula
10 February 2025
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వార్తల్లో నిలిచారు.
బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ మొత్తం సంపద రూ.115 కోట్లకు పైగా ఉంటుందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
పర్వేష్ వర్మ, అతని భార్యకు స్టాక్ మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టారు. వాటి విలువ రూ. 69 కోట్లకు పైమాటే.
గౌతమ్ అదానీ నుండి అనిల్ అంబానీ కంపెనీల వరకు, పర్వేష్ వర్మతోపాటు అతని భార్యకు రూ. 69 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.
పర్వేష్ వర్మ తనకు మరియు తన మొత్తం కుటుంబానికి LIC పాలసీ తీసుకున్నాడు. మొత్తం పెట్టుబడి రూ. 82.17 లక్షలు.
ఢిల్లీ బీజేపీ ఎంఎల్ఏగా గెలుపొందిన పర్వేష్ వర్మ, అతని కుటుంబం వద్ద దాదాపు రూ. 85 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
పర్వేష్ వర్మ కుటుంబానికి రూ.4.56 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ.8.30 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి.
ఢిల్లీ ఎంఎల్ఏ పర్వేష్ వర్మకు రూ.1.25 కోట్ల విలువైన ఇల్లు, రూ. 5 కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లె్క్స్ ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏనుగు తేనెటీగ అంటే భయపడుతుందా.?
ఆ దేశానికి ఆవు జాతీయ జంతువు..
లోకో పైలట్ లైసెన్స్ పొందడం ఎలా.?