TV9 Telugu

సుదర్శన్‌ సేతు బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

26 Febraury 2024

దేశంలోనే అతిపొడవైన తీగల వంతెన షురూ. 2.32 కిలోమీటర్ల పొడవైన సుదర్శన్ సేతును వంతెనను 979 కోట్ల రూపాయలతో నిర్మించారు.

గుజరాత్‌లోని ద్వారకలో అరేబియా సముద్రంపై నిర్మించిన అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.

ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకను కలుపుతూ నిర్మించిన ఈ పొడవైన వంతెనకు సుదర్శన్ సేతు అనే పేరు పెట్టారు.

నాలుగు లేన్‌లతో సుదర్శన్ సేతు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్‌పాత్ కోసం 2.50 మీటర్ల కేటాయింపు.

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఫుట్‌పాత్‌‌కు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు.

ద్వారకా నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయం చేరుకునేలా బ్రిడ్జి నిర్మాణం

సుదర్శన్ సేతు వంతెన అందుబాటులోకి రావడం వల్ల ద్వారకాధీష్ ఆలయం చేరుకునేందుకు ప్రమాణ సమస్య తీరిపోయింది.

దీంతో ద్వారకా చేరుకోవాలనే భక్తులకు సమస్య లేకుండా ఆ ద్వారకాధీశుని దర్శించుకొని అవకాశం కల్పించింది ప్రభుత్వం.