05 September 2023

జీ20 సదస్సు ప్రాముఖ్యత మీకు తెలుసా?

ప్రపంచంలోని అతిపెద్ద సంపన్న దేశాలు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమాఖ్యను గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ20 దేశాలు) గా వ్యవహరిస్తారు. 

 భారత్‌ సహా 19 ప్రపంచ దేశాలు, యూరోపియన్ యూనియన్ జీ20లో సభ్య దేశాలుగా ఉన్నాయి. 

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా‌కు ఇందులో సభ్యత్వముంది

ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా జీ20 దేశాలదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతు ఈ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా ఈ దేశాలదే.

ప్రతి సంవత్సరం ఓ సభ్య దేశం జీ20 సదస్సుకు అధ్యక్షతవహిస్తుండగా.. ఈ సారి భారత్ అధ్యక్షతవహిస్తోంది. 

మొట్టమొదటి జీ-20 సదస్సును 1999లో బెర్లిన్‌లో నిర్వహించారు. తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహించారు.

ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఆర్థిక అంశాలతో పాటు కీలక సమస్యలపై జీ20 సదస్సులో ప్రపంచ అగ్రనేతలు చర్చిస్తారు. 

వచ్చే శని, ఆదివారాల్లో (సెప్టెంబర్, 9, 10 తేదీలు) దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు. 

2022లో జీ20 సదస్సును ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించగా.. 2024లో బ్రెజిల్ జీ20 సదస్సుకు అధ్యక్షతవహించనుంది.