బాబోయ్‌.. కింగ్‌ కోబ్రా ఒకేసారి అన్ని గుడ్లు పెడుతుందా?

18 August 2023

కింగ్‌ కోబ్రా చాలా పొడవుగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన ప్రాణిగా పరిగణిస్తుంటారు. కింగ్‌ కోబ్రా జీవిత కాలం 20 సంవత్సరాలు.

ఇవి ఇతర పాముల మాదిరి కాటు వేయదు.. అది అమాంతంగా మింగుతుంది. కింగ్‌ కోబ్రా స్వభావ సిద్దంగా సిగ్గరి. సాధారణంగా ముఖాముఖిగా ఎవరి కంటబడానికి ఇవి ఇష్ట పడవు.

కానీ ఎదుర్కొన దలచినప్పుడు ఈ పాము పడగ పైకెత్తి బుసలు కొడుతూ పూర్తిగా తోకపై నిలబడగలవు. ఈ పాములు సాధారణంగా 10 నుంచి 13 అడుగుల వరకు పొడవు ఉంటాయి

కింగ్‌ కోబ్రా పాములు ఎక్కువగా భారత్, బంగ్లాదేశ్‌, మయన్మార్, మలేషియా, ఇండోనేషియా దేశాలలోని దట్టమైన అరణ్యాలలో కనిపిస్తాయి.

కింగ్‌ కోబ్రా జాతి అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ కింగ్‌ కోబ్రాపాము గరిష్ఠ సంఖ్యలో గుడ్లు పెడుతుంది

ఆడ కింగ్‌ కోబ్రా పాము ఒకేసారి 10 నుంచి 30 వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లను 48 నుంచి 70 రోజుల్లో పొదిగి పిల్లలను బయటికి తీసుకొస్తుంది

గుడ్లు నుంచి అప్పుడే బయటికి వచ్చిన పిల్ల కింగ్‌ కోబ్రాలు 20 నుంచి 30 సెంటీ మీటర్ల (8 నుంచి 12 అంగుళాలు) పొడవు ఉంటుంది

అటవీ అధికారుల సమాచారం మేరకు.. సాధారణంగా కింగ్‌ కోబ్రాలు ఏప్రిల్‌ - జులై నెలల మధ్య గుడ్లు పెడతాయి. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాలలో ఇవి నివసించడానికి ఎక్కువ ఇష్టపడతాయి.