రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడు గురించి మీకు తెలుసా..?

10 December 2023

వయసుతో సంబంధం లేకుండా రతన్ టాటా, శంతను నాయుడు మధ్య స్నేహం ఏర్పడింది? దీని వెనకు చాలా పెద్ద కథే ఉంది.

ప్రతిరోజులనే శంతను నాయుడు ఆఫీసు నుంచి తన ఇంటికెళ్తుంటే దారిలో రోడ్ పైన ఓ వీధి కుక్క చనిపోయి కనిపించింది.

దాని మృతదేహంపైనుంచే వాహనాలు వెళ్తుండటం శంతన్ మనస్సును కలచివేసింది. మర్నాడు ఓ రేడియం స్టిక్కర్‌లో కొన్ని కాలర్ బ్యాండ్లను రెడీ చేశారు.

ఆఫీసికి వెళ్లే మార్గంలో కనిపించిన కుక్కులకు వాటిని తగిలించారు. దాని ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ రోజు గడిచే సరికి విశేష స్పందన వచ్చింది.

స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున వాటిని తయారు చెయ్యాలనుకున్నారు. కానీ అందుకు తగ్గ పెట్టుబడి వారి దగ్గర లేదు. తండ్రి సలహాతో రతన్ టాటాకు లేఖ రాశారు

2 నెలలు తిరిగేసరికి స్వయంగా రతన్ టాటా తనను కలవాలంటూ రిప్లై ఇచ్చారు. అలా వారి కలల ప్రాజెక్టు సాకారమయ్యింది.

ఆ తర్వాత ఎంబీఏ చేసేందుకు అమెరికా వెళ్లినా.. చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా కోరిక మేరకు తిరిగి టాటా గ్రూపులోనే చేరారు.

కొన్నేళ్లకు రతన్ టాటా కోరిక మేరకు ఆయన వ్యక్తిగత సహయకుని బాధ్యతలు స్వీకరించారు. 2018 నుంచి  ఆయన వెంటే ఉంటూ అన్ని విధాల సాయంగా ఉంటున్నారు శంతన్.