ఇకపై ప్రతీ కుటుంబానికి రూ.2,000 ఆదా..!
TV9 Telugu
30 January 2024
విద్యుత్ రంగంలో వినూత్న ప్రయోగం. కొత్త సోలార్ ఎనర్జీ పాలసీ - 2024ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఢిల్లీ ప్రభుత్వం..
ప్రతి ఒక్కరు తమ ఇళ్ళు, భవనాలపై సోలార్ పవర్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా పాలసీ రూపకల్పన చేసింది ప్రభుత్వం.
500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్‌లను తప్పనిసరి చేసిన ఢిల్లీ సర్కార్.
ఢిల్లీలోని విద్యుత్ వినియోగదారులు పోర్టల్ ద్వారా సంప్రదించి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవచ్చు.
డిస్కమ్ సోలార్ ప్యానెల్స్, నెట్ మీటర్లను ఏర్పాటు ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రజలు పాలసీ కింద ప్రయోజనాలు.
వినియోగదారుడు తన రూఫ్‌టాప్‌పై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్‌ను అమర్చేందుకు ఖర్చు రూ.90,000 అవుతుంది.
ప్రతి నెల వినియోగదారుడికి రూ. 700 ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించిన ఢిల్లీ సర్కార్.
ప్యానెళ్లను అమర్చిన తర్వాత 25 ఏళ్లపాటు వినియోగదారులకు విద్యుత్తు ఉచితం. 3 కిలోవాట్ల ప్యానెల్‌ను అమర్చుకుంటే, బ్యాంక్ ఖాతాలో యూనిట్‌కు రూ.3 జమ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి