త్వరలో భారత్‌కి ఛత్రపతి శివాజీ వాడిన ‘ప్రత్యేక ఆయుధం’!

09 September 2023

ఛత్రపతి శివాజీ వినియోగించిన పదునైన ఆయుధం (వాఘ్ నఖ్)ను త్వరలోనే భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

శత్రువులను మట్టికరిపించేందుకు ఛత్రపతి శివాజీ వాడిన ఈ ఆయుధం (వాఘ్ నఖ్) పులి గోర్ల ఆకారంలో పోదునుగా ఉంటుంది.

1659లో బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్‌ను చంపేందుకు ఛత్రపతి శివాజీ ఈ ప్రత్యేక ఆయుధాన్ని వాడినట్లు చెబుతారు.

అనంతర కాలంలో బ్రిటీష్ అధికారి శివాజీ వాఘ్ నఖ్ ఆయుధాన్ని బహుమతిగా బ్రిటన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన వాఘ్ నఖ్  ఆయుధం ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.

మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ ఆయుధాన్ని ఆ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం.

నవంబర్‌లో దీన్ని లండన్ నుంచి మహారాష్ట్రకు  తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇందు కోసం మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ సెప్టెంబర్ నెలాఖరులో బ్రిటన్ వెళ్లనున్నారు.

అంతా అనుకున్నట్లు జరిగితే అఫ్జల్ ఖాన్‌‌ను శివాజీ హతమార్చిన నవంబరు 10ననే ఈ ఆయుధం మహారాష్ట్రకు చేరుకుంటుంది.