29 September 2023

పీఎం కిసాన్ లిస్టులో పేరు ఇలా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకంలో భాగంగా 15వ విడత నిధుల విడుదల చేసిన కేంద్రం.

అనదాతలు లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఉండవు. 

లబ్ధిదారులు పీఎం కిసాన్ లిస్ట్ లో స్టేటస్ తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

లిస్ట్‌లో పేరు కోసం లబ్ధిదారులు ముందుగా https://pmkisan.gov.in// వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. 

పీఎం కిసాన్ హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఓపెన్ అయ్యే పేజీలో బెనిఫిసియరీ స్టేటస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

మీ రాష్ట్రం, మీ జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, మండలం, గ్రామం పేరు వంటి పూర్తి వివరాలు నమోదు చేయాలి.

అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో గెట్ రిపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా వస్తుంది. స్క్రీన్ పై కనిపంచే జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. 

జాబితాలో పేరు లేకుంటే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి మళ్లీ రిజిస్టర్ చేయించుకోవాలి.

ఆన్‌లైన్ ద్వారా రైతులు నేరుగా పేర్లను నమోదు చేసుకోవచ్చు. అందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.