రోడ్డు ప్రమాద బాధితులకు గోల్టెన్‌ అవర్‌ పేరిట కేంద్రం పథకం!

TV9 Telugu

13 March 2024

రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలిగించే వార్త. గోల్డెన్‌ అవర్‌ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తుంది.

దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో నగదు రహిత ఉచిత చికిత్స అందనుంది.

ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పిలుస్తారు. గంటలోగా సరైన చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ.

హర్యానా, చంఢీగఢ్‌లో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

కేంద్ర సమాచారం ప్రకారం ఈ పథకం కింద రూ.1.5 లక్షలు లేదా 7 రోజుల ఆసుపత్రి చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దాన్ని ఉచితంగా అందిస్తారు.

గోల్టెన్‌ అవర్‌ పేరిట బాధితులకు ఉచిత వైద్యం కేంద్రం పథకం కోసం ఎంవీఏ చట్టం-2019కి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం సాధారణ బీమా కంపెనీలు 0.5 శాతం థర్డ్‌ పార్టీ ప్రీమియం వితరణతో సుమారు రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నాయి.

ఈ పథకం అమలు చేస్తే రోడ్ ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని చాల వరకు తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు, ప్రముఖులు.