23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్‌?

TV9 Telugu

16 March 2024

కుక్కలను తమ పిల్లలుగా పెంచుకుంటారు ఓనర్స్‌. ఇక ఎంత టెన్షన్‌లో ఉన్నవారికైనా పెట్‌ డాగ్స్‌ ప్రశాంతతను ఇస్తాయి.

ఎంతో విశ్వాసంగా ఉంటూ తమ ఓనర్స్‌ని పెంపుడు కుక్కలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవి చాల చోట్ల జరిగాయని విన్నాం.

ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని రకాల కుక్కలతో ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం.

23 జాతుల పెంపుడు కుక్కలు ప్రమాదకరమైనవని తాజాగా కేంద్రం పేర్కొంది. దాడులతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నాయని వాటి అమ్మ‌కాల‌ను బ్యాన్ చేసింది.

23 జాతుల కుక్కల బ్రీడింగ్‌ లేదా సంతాన వృద్ధిని, అమ్మకాలను నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

పిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రోట్‌వీల‌ర్‌, మ‌స్టిఫ్స్‌, టొసా ఇను, అమెరిక‌న్ స్టాఫ‌ర్డ్ షైర్ టెర్రియ‌ర్‌, డోగో అర్జెంటీనో

సెంట్ర‌ల్ ఆసియ‌న్ షెఫ‌ర్డ్‌, సౌత్ ర‌ష్య‌న్ షెఫ‌ర్డ్‌, వుల్ఫ్ డాగ్స్‌, మాస్కో గార్డ్ జాతుల కుక్క‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

పౌరులు, పౌర సంస్థ‌లు, జంతు సంర‌క్ష‌ణ సంస్థ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిశీలించి కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది.