జాలీ.. జాలీగా.. తక్కువ బడ్జెట్‌లో సౌత్‌ ఇండియా టూర్‌!

February  28, 2024

TV9 Telugu

మన దేశంలో ఎండాకాలంలో భరించలేని వేడి ఉంటుంది. మండే ఎండలకు తాళలేక చాలా మంది చల్లని ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లి సేద తీరుతుంటారు

అలాంటి చల్లని పర్యాటక ప్రదేశాలు దక్షిణ భారత్‌లో అనేకం ఉన్నాయి. గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహజ ప్రకృతి సౌందర్యం, రుచికరమైన వంటకాలతో తక్కువ బడ్జెట్‌లోనే ఈ బ్యూటీఫుల్‌ ప్రదేశాలను చుట్టేయండి

పురాతన కాలంనాటి రాక్‌కట్‌ దేవాలయాలు, శాల్పాలకు ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని మహాబలిపురం మంచి ఎంపిక. పక్కనే ఉన్న బీచ్‌లో సేద తీరడంతోపాటు అక్కడి 5 ప్రసిద్ధ రధాలను సందర్శించవచ్చు

కర్ణాటకలోని కూర్గ్‌లోని కాఫీ తోటలు, అందమైన ప్రకృతి దృశ్యాలు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. బడ్జెట్‌కు అనుకూలమైన వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి

కేరళలోని వర్కలలో ఉన్న అరేబియా సముద్రం.. పక్కనే ఉన్న కొండలు.. వాటిపక్కనే నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు

కర్ణాటకలోని బాదామిలో ఉన్న రాతి గుహలు, పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. చారిగ్రక ప్రదేశాలు సందర్శించే వారికి బాదామి మంచి ఎంపిక

తమిళనాడులోని కన్యాకుమారి.. ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకునే వారికి స్వర్గదామి. ఈ తీర ప్రాంతంలో అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రదేశాన్ని చూడొచ్చు

తమిళనాడులోని ఊటీ.. టీ తోటలు, యూకలిఫ్టస్‌ చెట్లతో అద్భుతంగా ఉంటుంది. అలాగే పుదుచ్చేరి, కర్ణాటకలోని గోకర్ణ, కేరళలోని మున్నార్, కర్ణాటకలోని హంపి.. వంటి ప్రదేశాలు తక్కువ బడ్జెట్‌లో విహారయాత్రలు చేయాలనుకునే వారు చూడదగ్గ ప్రదేశాలు