భావిగతి మార్చిన సంస్కర్త పీవీకి.. 'భారతరత్న'

February  09, 2024

TV9 Telugu

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ న‌ర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భార‌త‌ర‌త్న అవార్డును ప్రక‌టించింది

పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్రధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్యవ‌సాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా కేంద్రం భార‌త ర‌త్న అవార్డును ప్రక‌టించంది

పీవీ న‌ర్సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వడం ప‌ట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పీవీ ఓ మేధావి, రాజ‌నీత‌జ్ఞుడు అని త‌న ట్విట్టర్‌ ఖాతాలో కీర్తించారు

పీవీ న‌ర్సింహారావు అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు విభిన్న హోదాల్లో న‌ర్సింహారావు ప‌నిచేశారు

పీవీ నరసింహరావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు

వరంగల్‌ జిల్లాలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పీవీ ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పెరిగారు. స్వాతంత్ర్య ఉద్యమం, హైదరాబాద్‌ విముక్తి పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు

మొదట జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన బూర్గుల శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు

దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడిపించినా పీవీ ప్రభుత్వం 1996 ఎన్నికల్లో అపజయం పాలు కావడం పట్ల ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా ఎక్కడా ఎలాంటి అవినీతి మకిలీ అంటకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం