8 August 2023

 ట్రాఫిక్ సమస్య.. ఏకంగా రూ.20,000 కోట్ల నష్టం

దేశ ఐటీ రాజధాని బెంగళూరు లో ట్రాఫిక్‌ ను దాటుకొని, గమ్యస్థానాలకు చేరాలంటే కొన్నిగంటలు వెచ్చించాల్సి ఉంటుంది. 

ఆ పరిస్థితిపై నెటిజన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలు సోషల్‌ మీడియాలో పంచుకోవడం చూస్తూనే ఉంటాం. 

ఇలా ట్రాఫిక్ అంతరాయాలు, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి వల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోంది. 

ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్‌ శ్రీహరి, ఆయన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 

రోడ్‌ ప్లానింగ్‌, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలను పరిశీలించిన మీదట ఈ విషయాన్ని వెల్లడించింది.

పూర్తిస్థాయిలో పనిచేసే 60 ఫ్లైఓవర్లు ఉన్నను.. బెంగళూరు నగరం ఏటా దాదాపు రూ. 20 వేలకోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూస్తోందని వెల్లడించింది. 

భారీగా పెరిగిన జనాభాకు తగ్గట్టుగా.. వాహనాల సంఖ్య 1.5 కోట్లకు చేరువగా ఉంది. దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేదని ఆ బృందం గుర్తించింది. 

ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటూ వేగంగా పెరుగుతోన్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన సరిపోవడం లేదు. 

ఆ అంతరాయాలను తొలగించేందుకు వీలుగా వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని కేంద్రమంత్రి.. శివకుమార్‌కు సూచించారు.