మన దేశంలో అరటి సాగు చేసే టాప్ 10 రాష్ట్రాలు ఇవే..
February 19, 2024
TV9 Telugu
అరటిపండ్లు రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రపంచంలో అరటి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారతదేశం
ప్రపంచంలో అరటిపండ్ల ఉత్పత్తిలో 30.18 మిలియన్ టన్నుల ఉత్పత్తితో భారత్ అగ్రగామిగా ఉంది. మన దేశంలో మొత్తం పండ్ల సాగులో 13 శాతం అరటిపండ్లను సాగు చేస్తున్నారు
మన దేశంలో అరటి పండ్లను ఉత్పత్తి చేస్తున్న టాప్10 రాష్ట్రాలల్లో.. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, మిళనాడు, కర్ణాటక ఉన్నాయి
దక్షిణాదిలో అరటి సాగులో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ యేటా 5.83 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అరటిసాగు జోరుగా సాగుతోంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 18%గా ఉంది
అరటి సాగులో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర 4.62 మిలియన్ టన్నుల అరటిని ఉత్పత్తి చేస్తుంది. దేశం మొత్తం అరటి ఉత్పత్తిలో ఇది14% గా ఉంది
దేశంలో మొత్తం అరటి ఉత్పత్తిలో దాదాపు 12% వాటాతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. ఏటా 3.90 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది
తమిళనాడు ఏటా 3.89 మిలియన్ టన్నులు (12 శాతం), కర్ణాటక 3.71 మిలియన్ టన్నులు (11.5 శాతం), ఉత్తర ప్రదేశ్ ఏటా 3.39 మిలియన్ టన్నులు (10.50%) ఉత్పత్తి చేస్తోంది
బీహార్ ఏటా 1.96 మిలియన్ టన్నుల (6%), పశ్చిమ బెంగాల్ 1.14 మిలియన్ టన్నులు (3.50%), అస్సాం 1.10 మిలియన్ టన్నులు (3.41%), ఛత్తీస్‌గఢ్ 0.58 మిలియన్ టన్నులు (1.80%) ఉత్పత్తి చేస్తున్నాయి