కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు.
ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు ప్రియాంక గాంధీ.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ప్రియాంకకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.46.39 లక్షలు.
ప్రియాంక గాంధీ ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్.
ప్రియాంక భర్త రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువ చేసే 4400 గ్రాములకు పైగా బంగారం.
స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లు. వీటిలో న్యూఢిల్లీలోని మెహ్రౌలి ఏరియాలో రెండు అగ్రికల్చరల్ ల్యాండ్స్ (ఇన్‌హెరిటెడ్ హాఫ్-షేర్స్), ఫామ్‌హౌస్‌లో హాఫ్-షేర్.
సొంతంగా హిమాచల్ ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ. దీని విలువ రూ.5.63 కోట్లు. రూ.15.75 కోట్ల మేరకు రుణాలు.
ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రాకి రూ.37.9 కోట్లు విలువచేసే చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు.