TV9 Telugu

ఈ దేశానికి ఎప్పుడూ మతం లేదు: అసదుద్దీన్..

28 Febraury 2024

మంగళవారం టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే ‘సత్తా సమ్మేళనం’లో AIMIM నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

అయోధ్యలో చేసిన పోరాటం మసీదు గురించి కాదని, మసీదు వెలుపల ఉన్న ప్లాట్‌ఫారమ్ గురించి అని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని అతిపెద్ద న్యాయస్థానం విశ్వాసం ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందని అన్నారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.

విశ్వాసం ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సాక్ష్యం ఏమవుతుంది? విశ్వాసం ఆధారంగా దేశం నడవదని ఏఐఎంఐఎం అధినేత అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టకుంటే 2024 జనవరి 22న రామమందిరం కార్యక్రమం జరిగేదా?

ఈ దేశానికి ఎప్పుడూ మతం లేదు, ఒక మతంతో ముడిపెట్టకూడదు. నా విశ్వాసం కంటే ఒకరి విశ్వాసం ఎలా పెద్దదిగా మారింది?

ప్రజలు సుప్రీంకోర్టుకు వాగ్దానాలు చేసినప్పటికీ డిసెంబర్ 6వ తేదీన జరిగిన సంఘటన జరిగిందన్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.