TV9 Telugu

నన్ను అరెస్ట్ చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: కేజ్రీవాల్..

28 Febraury 2024

టీవీ నెట్‌ వర్క్‌ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) పవర్ కాన్ఫరెన్స్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మద్యం కుంభకోణం కేసు రెండేళ్లుగా నడుస్తోందన్నారు.

ఈ కేసులో ఈడీ వెయ్యికి పైగా దాడులు నిర్వహించిందని, తనను జైలుకు పంపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేజ్రీవాల్‌ అన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్టు చేశారో తెలియడం లేదని అన్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు డబ్బును రికవరీ చేయలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నన్ను పిలిపించడం కాదు, నన్ను అరెస్ట్ చేయడమే. దీనిని దేశం మొత్తం చూస్తోందని అన్నారు.

ఢిల్లీలోని స్లమ్ కాలనీల్లో పనిచేస్తున్న కొంతమంది వాలంటీర్ల నుంచి నాకు కాల్ వచ్చింది. కేజ్రీవాల్ ఈడీకి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలు నాకు చెబుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఈడీ సమన్లు ​​ఎలా చట్టవిరుద్ధమో తాను కోర్టుకు వెళ్లి వివరిస్తానన్నారు. కోర్టు చెబితే తప్పకుండా వెళ్తానని చెప్పుకొచ్చారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోంది.. పాఠశాలలు ఎలా నిర్మించాలో నాకు తెలుసు. మంచి విద్యను ఎలా అందించాలో తనకు తెలుసని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు.