06 November 2023
భారతీయ రైతుల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్
వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్స్‌పోలో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన రైతుల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిన APEDA.
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోలుదారులకు మిల్లెట్ సంబంధిత ఉత్పత్తులను పరిచయం చేశారు.
వరల్డ్ ఫుడ్ ఇండియాలో అమెరికా, కెనడా, UAE, సౌదీ అరేబియా, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగానే ఈసారి భారతీయ రైతుల ఉత్పత్తులను సిద్ధం చేసిన APEDA ప్రభుత్వ సంస్థ.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన మీర్జాపూర్‌లోని నల్ల బియ్యాన్ని ప్రదర్శనకు పెట్టిన రైతులు.
ప్రత్యేక ఆకర్షణగా సంవర్ధన్ పేరుతో అన్ని ఆరోగ్య పరమితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పానీయం తయారీ చేసిన రాంపూర్ రైతు అమిత్ వర్మ.
మిల్లెట్‌తో కూడిన నామ్‌కీన్ తయారు చేసిన పాటియాలాకు చెందిన హెచ్‌పిఎస్ లాంబా. అధిక ప్రోటీన్ ఉన్న దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసే ప్రయత్నం.
పాడి పంటలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న రైతుల ఉత్పత్తులను ప్రోత్సాహించడమే లక్ష్యంగా పెట్టుకున్న APEDA.
ఇక్కడ క్లిక్ చెయ్యండి