దుబాయ్ లో అనంత్ అంబానీ, రాధిక షాపింగ్‌

TV9 Telugu

10 April 2024

పెళ్లి అంటేనే సామాన్యుడు సైతం వీలైనంత అట్టహాసంగా జరుపుకునే ఒక వేడుక. అదే పెళ్లి వేడుక శ్రీమంతుల ఇంట్లో జరిగితే అది ఓ రేంజ్ లో ఉంటుంది.

భారతీయ కుబేరుడు ముకేశ్ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నట్లు తెలిసిన విషయమే.

ఇటీవల అనంత్ అంబానీ రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సినీతారలు కూడా సందడి చేసారు.

రాధికా మర్చంట్ తో అనంత్ అంబానీ పెళ్లి జులైలో జరగబోతోంది. తాజాగా అనంత్, రాధిక జంట దుబాయ్ లో షాపింగ్ చేశారు.

భారీ సెక్యూరిటీ నడుమ వారు షాపింగ్ చేసిన తర్వాత కొనుక్కున్న వస్తువులను హోటల్‌కు చేర్చడానికి భారీ కాన్వాయ్‌ సహాయం తీసుకున్నారు.

షాపింగ్‌ చేసిన వస్తువులను తెచ్చుకోవడానికి ఏకంగా రూ. 25 కోట్ల విలువైన కార్ల కాన్వాయ్ ని వినియోగించారు.

ఆ కాన్వాయ్ లో రోల్స్ రాయిస్ కలినాన్ బ్లాక్ బ్యాడ్జ్ తో పాటు ఎన్నో ఇతర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక అంబులెన్స్ కూడా ఉంది.

గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది వీరి వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు.