TV9 Telugu

FCRA చట్టాన్ని బలోపేతం చేస్తాం: అమిత్ షా..

28 Febraury 2024

TV9 నెట్ వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ పవర్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వీటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేస్తామన్నారు అమిత్‌ షా.

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలో సవరణ విషయంపై అమిత్ షా మాట్లాడుతూ మత మార్పిడుల కోసమైతే ఎన్‌జిఓల డబ్బును భారత్‌కు రానివ్వబోమన్నారు.

దేశంలో FCRA చట్టాన్ని బలోపేతం చేస్తాం. ఇందులో భాగంగా ఎన్నారైలు తమ నిధులకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి. తమ లక్ష్యాల గురించి చెప్పాలి.

అలాగే వారి ఖాతాలను కూడా ఆడిట్ చేస్తాం. మీ లక్ష్యం ,ప్రోగ్రామ్, ఆడిట్ సరిగ్గా లేకుంటే మాత్రం మిమ్మల్ని అడ్డుకుంటాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఇదే సమావేశంలో CAA చట్టంపై అమిత్ షా మాట్లాడుతూ, ఈ చట్టం ప్రజలకు రాజకీయ సమస్య కావచ్చు, కానీ ఇది ఒక పెద్ద సామాజిక సంస్కరణ అని అన్నారు.

దేశంలో ఏ మతం ఆధారంగా చట్టం ఉండకూడదనేది ప్రజాస్వామ్య ప్రాథమిక డిమాండ్ అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

ఇక 2024 ఫలితాల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని జోస్యం చెప్పారు భరత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.