01 September 2023

ఈ పనులన్నీ సెప్టెంబర్ లో పూర్తి చేయాల్సిందే.. లేకపోతే చిక్కులు తప్పవు.. 

ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతూ వస్తాయి. అలాగే 1 సెప్టెంబర్ 2023 నుంచి కొన్ని కొత్త నియమాలు.. మారుతున్న పాత నియమాలు ఏమున్నాయో తెలుసుకుందాం 

ఎల్‌పిజి సిలిండర్ ధరను ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం మొదటి తేదీ కంటే ముందే సిలిండర్ ధరలను రూ.200 తగ్గించింది. 

సెప్టెంబర్ 1 న కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ ధరలు తగ్గిస్తాయో.. లేదో అనే దానిపై సందిగ్ధత ఉంది 

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 14 సెప్టెంబర్ 2023 వరకు ఆధార్ లో  ఉచిత అప్‌డేట్‌లను చేయవచ్చు. 

ఆ తరువాత ఆధార్ అప్ డేట్స్ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది 

2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు నెలల గడువు అంటే 30 సెప్టెంబర్ 2023 వరకు. 

స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులు 30 సెప్టెంబర్ 2023లోపు ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి.. ఆలోగా  దీన్ని చేయకపోతే మీ ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)సెప్టెంబర్ 30, 2023 వరకు ట్రేడింగ్- డీమ్యాట్ ఖాతాదారుల కోసం నామినేషన్ చేయడానికి లేదా నామినేషన్ మార్చడానికి గడువు ఇచ్చింది 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల ప్రత్యేక FD పథకం SBI వీకేర్‌లో పెట్టుబడి కోసం గడువును 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించింది.  

SBI సీనియర్ సిటిజన్స్ స్కీమ్ 7.50 శాతం వడ్డీ రేటును ఇస్తున్నారు.