తండ్రి యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి!
TV9 Telugu
12 March 2024
తండ్రి యూనిఫామ్ ధరించి ఓ యువతి ఇండియన్ ఆర్మీలో చేరింది. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ సైన్యంలో చేరింది.
20 ఏళ్ల క్రితం మేజర్ నవ్‌నీత్ వత్స్ జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ అక్కడ కాల్పుల్లో అమరుడయ్యారు.
అయితే తండ్రి దేశభక్తిని పుణికిపుచ్చుకుంది ఆయన కుమార్తె. ఆయన యూనిఫామ్ ధరించి ఆర్మీలో సైనికురాలిగా చేరింది
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టెనెంట్‌గా బాధ్యతలు స్వీకరించింది
పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి హాజరైంది. ఆమెకు స్వాగతం పలుకుతూ ఇండియన్ ఆర్మీ నెట్టింట ఓ పోస్టు పెట్టింది.
ఇనాయత్ తండ్రి మేజర్ నవ్‌నీత్ వత్స్ స్వస్థలం చండీగఢ్. 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో ఆయన విధులు నిర్వర్తించారు.
2003 నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో ఆయన అమరుడయ్యారు. అప్పటికి ఇనాయత్ వయసు మూడేళ్లు.
ఇనాయత్ వత్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2023 ఏప్రిల్‌లో చెన్నైలో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొందింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి