కేజ్రీవాల్ అరెస్టుకు 5 కారణాలు ఇవే!
TV9 Telugu
23 March 2024
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి, విచారిస్తుంది ఈడీ. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆప్ అధినేత అరెస్టు.
లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుని వారం రోజులు గడవకముందే కేజ్రీవాల్ అరెస్ట్ కావడం సర్వత్రా చర్చ.
అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు 5 కారణాలు కనిపిస్తున్నాయి అవి ఎంటో ఒక్కసారి చూద్దాం..!
ఢిల్లీలో నూతన లిక్కర్ పాలసీని ఉపయోగించుకుని కల్వకుంట్ల కవితతో కలిసి ఆప్ నేతలు కుట్ర చేశారనేది ED అభియోగం.
ఈ కుట్రలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కీలక పాత్ర పోషించాలని ED చెప్తోంది.
సౌత్ గ్రూప్‌నకు ఆయాచిత లబ్ది కలిగేలా పాలసీ మార్చినందుకు కవిత నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్లు ముట్టాయనేది మరో ఆరోపణ.
ఇక ఆమోదానికి ముందే లిక్కర్ పాలసీపై కవితకు లీక్‌లు ఇచ్చారని కేజ్రీవాల్‌పై అభియోగం మోపింది దర్యాప్తు సంస్థ ఈడీ..!
కవితతోపాటు మరికొందరికి లాభం చేకూర్చినందుకు ముడుపులు అందుకున్నారని ఆ డబ్బులే అప్పుడు గోవా ఎన్నికల్లో వాడారనే కేజ్రీవాల్‌పై ఆరోపణలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి