09 September 2023
అద్దంలాంటి క్లియర్ స్కిన్ కోసం, ఈ 6 పదార్థాలను పచ్చి పాలలో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయండి. తద్వారా మంచి ముఖారవిందం సొంతం చేసుకోవచ్చు.
పచ్చి పాలలో కొంచెం శనగపిండిని కలిపి ముఖానికి పట్టించాలి. మెరిసే చర్మం కోసం మీరు ఈ పేస్ట్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
పచ్చి పాలలో కొంచెం పసుపు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ అందం రెట్టింపు అవుతుంది.
అవకాడోను మెత్తగా చేయాలి. అందులో కొన్ని పచ్చి పాలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
పచ్చి పాలలో టొమాటో గుజ్జును కలపండి. దానిని ముఖానికి పట్టించాలి. ఈ పేస్ట్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు మచ్చలను కూడా తొలగిస్తుంది.
ఒక గిన్నెలో అరటిపండు ముక్కను మెత్తగా చేయాలి. దానికి కొన్ని పచ్చి పాలు కలపండి. ఈ పేస్ట్‌తో చర్మం మృదువుగా, బిగుతుగా మారుతుంది.
ముల్తానీ మిట్టిని కొన్ని పచ్చి పాలలో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయండి. దీంతో చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
తేనె, పచ్చి పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మీ చర్మానికి బ్లీచ్ లాగా పనిచేస్తుంది. మీరు తేనె, పచ్చి పాలు, నిమ్మరసం మిక్స్ చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే నేక సమస్యలు తొలగిపోతాయి.