14 April 2024
TV9 Telugu
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకీ పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. కారు కొనుగోలు చేసేవారికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
ప్రస్తుత నెలకుగాను బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతోపాటు ఇతర మాడళ్లపై 1.5 లక్షల రూపాయాల వరకు రాయితీకి విక్రయిస్తోంది.
వీటితోపాటు ఎక్స్‌ల్‌ఆర్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా మిల్డ్ హైబ్రిడ్, టర్బో-పెట్రోల్ రకం ఫ్రాంక్స్‌పై ఈ రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్‌ఎల్6, ఫ్లాగ్‌షిప్ ఇన్విక్టో ఎంపీవీ మాడళ్లకు ఈ రాయితీలు వర్తించవని పేర్కొంది.
ఇగ్నీస్ మాడల్ రూ.58 వేల తగ్గింపు. వీటిలో నగదు రూపంలో రూ.40 వేలు తగ్గనుండగా, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేలు తగ్గింపు.
బాలెనో: మార్కెట్లో ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై రూ.35 వేలు నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేలు.
సియాజ్ మల్టీపర్పస్ మాడలైన సియాజ్‌పై రూ.53 వేలు రాయితీ, వీటిలో రూ.25 వేలు ధరను తగ్గించనుండగా, ఎక్సేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3వేలు.
గ్రాండ్ విటారాలో నగదు డిస్కౌంట్లు, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలుపుకొని రూ.84 వేల వరకు తగ్గిస్తోంది.