ఒంటరితనం ఎంత ప్రమాదమో తెలుసా.? 

04 December 2023

ఒంటరితనంతో ఎక్కువ కాలం గడిపేవార పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఒంటరితనంతో కుంగుబాటు, ఆందోళన, హృద్రోగం, స్ట్రోక్‌ వంటి సస్యలతో పాటు అకాల మరణానికి కూడా కారణంగా మారొచ్చని చెబుతున్నారు. 

సామాజికంగా దూరం కావడం, అనుబంధాలపై ప్రభావం పడడం వంటి సమస్యలు.. అంతర్జాతీయ ఆరోగ్య ముప్పు కారకంగా మారుతుందని WHO చెబుతోంది.

ఇదిలా ఉంటే ఒంటరితనంతో కలిగే దుష్ప్రభావాలను నివారించేందుకు. జాతీయ వ్యూహాల‌ను రూపొందించి అమ‌లు చేసేందుకు డ‌బ్ల్యూహెచ్ఓ ఆయా దేశాల‌తో క‌లిసి ప‌నిచేస్తోంది.

ఒంటరితనం ఒక అంటువ్యాధి అనే పేరుతో ప్రచురించిన నివేదికలో ప్రపంచ ఆరోగ్య సమస్య పలు కీలక విషయాలను ప్రస్తావించింది. 

ఒంటరితనంతో బాధపడేవారు రోజుకు 15 సిగరెట్లు తాగడంతో కలిగే నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. 

రోజుకు 15 సిగరెట్లు కాల్చితే ఎంతటి ప్రాణాంతకమో, నిత్యం ఒంటరితనంతో ఇబ్బందిపడడం కూడా అంతే ప్రమాదకరమని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే ఒంటరితనం, నలుగురితో కలవలేకపోవడం వ్యక్తుల సామర్థ్యం, ఉత్పాదకత క్షీణించడంలో కీలకపాత్ర పోషిస్తుందని WHO నివేదికలో పేర్కొంది.