జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులు ఆయా వ్యక్తుల జన్మ నక్షత్రం, జన్మించిన సమయం ఆధారంగా కేటాయించడం జరుగుతుంది. రాశుల వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా ఉంటాయి.
రాశి చక్రాలు
వీరు ప్రగతిశీల, వినూత్న ఆలోచనలకు ప్రసిద్ధి చెందారు. కుంభ రాశి వారి మనస్సు విశాలమైనది. ఎవరైనా ఏమైనా సాయం కోరితే కాదనకుండా చేస్తారు. ఇతరుల పట్ల జాలి ప్రదర్శిస్తారు.
కుంభరాశి
ఈ రాశి వారు సాహసోపేతంగా ఉంటారు. కొత్త సంస్కృతులు, ఆలోచనలను అన్వేషించడానికి ఇష్టపడతారు. వీరి మనస్సు కూడా చాలా విశాలమైనది. విశాల దృక్పథంతో ఆలోచిస్తుంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు మేధోపరమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఈ రాశి వారు దయా హృదయులు. ఇతరులపై జాలి చూపుతారు.
మిథునరాశి
ఈ రాశి వారు సామరస్యానికి, న్యాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. వీరు తమ స్వశక్తిని నమ్ముకుంటారు. ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉంటారు. అడిగిన సాయం కాదనకుండా చేస్తారు.
తులారాశి
ఈ రాశి వారు సాధారణంగా కరుణ స్వభావం కలిగి ఉంటారు. బాహ్య అంశాలపై ఒక అవగాహన కలిగి ఉంటారు. అందరికీ అండగా నిలిచే విశాల మనస్తత్వం వీరి సొంతం.
మీన రాశి
ఈ రాశి వారు మార్గదర్శక స్ఫూర్తిని కలిగి ఉంటారు. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉంటారు. సున్నిత మనస్కులు అయినప్పటికీ.. చాలా స్ట్రాంగ్‌గా ఆలోచిస్తారు. ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉంటారు.