రోజుకొక్క యాలకులు తింటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే
15 October 2024
TV9 Telugu
TV9 Telugu
యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయంటున్నాయి పలు అధ్యయనాలు. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట
TV9 Telugu
యాలకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు... ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది
యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే... శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి
TV9 Telugu
ప్రతిరోజూ ఒకటీ లేదంటే రెండు యాలకులు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి ఆహారం వాసన, రుచిని పెంచే ఏలకులు మన ఆరోగ్యానికి ఒక వరం
TV9 Telugu
ఇందులో పొటాషియం, సోడియం, డైటరీ ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, ఐరన్‌తో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. ఆహారానికి సువాసన, రుచిని పెంచే పచ్చి ఏలకులు మన ఆరోగ్యానికి ఒక వరం
TV9 Telugu
యాలకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తి ధృడంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రోజూ ఒక యాలకులను నమలాలి
TV9 Telugu
పచ్చి యాలకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగు అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, వికారం, వాంతులు వంటి సమస్యల ప్రభావాలను తగ్గించే సామర్థ్యం వీటికి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ యాలకులు నమలడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది