నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ పని చేయండి..!

Jyothi Gadda

21 September 2024

నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు దూరంగా ఉండి మట్లాడుతారు. ఇది మీకు అవమానంగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సమస్యకు చెక్‌పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. 

ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మూత్ర విసర్జనతో కడుపులోని మలినాలు తొలగిపోవటంతో నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇది మీకు చక్కటి పరిష్కారం అవుతుంది.

ఉదయం బ్రష్‌ చేయగానే ఒక గ్లాస్‌ నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన దూరమవుతుంది. 

అంతేకాదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. దీంతో నోటి దుర్వాసన లేకుండా ఫ్రేష్‌గా ఉంటుంది. 

నోటి దుర్వాసనను పోగొట్టడంలో కొబ్బరి నూనె కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే నోట్లో కొద్దిగా కొబ్బరి నూనె పోసుకుని, కాసేపు పుక్కిలిపట్టి ఆ తర్వాత నోరు కడిగేసుకోండి. 

ఆవనూనెలో ఉప్పు కలిపి వేళ్లతో చిగుళ్లను బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేగాక మీ దంతాలు కూడా మిలమిలా మెరుస్తాయి.

అదేవిధంగా రోజులో ఎప్పుడైనా వీలు చేసుకుని పుదీనా ఆకులను నమలండి. పుదీనా నమలడం ద్వారా కూడా నోట్లో నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ఇది నోటిని చల్లగా కూడా ఉంచుతుంది.

రోజుకి రెండు సార్లు రెండు నిమిషాల పాటు పళ్ళు తోముకోవడం మంచిది. నాలుకతో సహా దంతాలు క్లీన్ చేయాలి. నోటిలోని ఆహార కణాలను బయటకి పంపడానికి పుక్కిలించాలి.