రంజాన్ మాసంలో ఇస్లాం సోదరులు ఆచరించే కఠిన ఉపవాస దీక్షలో ఖర్జూరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రోజూ ఈ దీక్ష విరమించేటప్పుడు ‘ఖర్జూరాలు’ తప్పకుండా తీసుకుంటారు
ఈ పండ్లు శరీరానికి తక్షణ శక్తినివ్వడం మాత్రమేకాకుండా ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి
ఖర్జూర పండ్లలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి
ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో విటమిన్ ‘ఎ’ ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి, ఇతర కంటి సమస్యలు కూడా దూరమవుతాయి
క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు ఖర్జరంలో అధికంగా ఉంటాయి. క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడానికి, కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి
మలబద్ధకంతో బాధపడేవారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తినడంతోపాటు ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది
ఖర్జూరంలో ఉండే వివిధ పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు