మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ అందం!
Jyothi Gadda
14 July 2024
అలోవెర్ జెల్ అనేది నేచురల్ మాయిశ్చరైజర్. దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల సహజ కాంతి వస్తుంది. ముఖం బ్రైట్‌గా, అందంగా మారుతుంది.
తేనె, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫ్రక్టోజ్, మినరల్స్, యాసిడ్స్‌లోని ముఖ్యమైన పోషకాలు శరీరం ,చర్మాన్ని రక్షించడంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు.
తేనెలో అలోవేరా జెల్ కలిపి రాసి 15 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. పొడి చర్మం తగ్గి మొటిమలు కూడా దూరమవుతాయి.
అలోవెర్ జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చెయొచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ ముఖంపై మ్యాజిక్ చేస్తుంది. ఇలా రాసి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.
గంధం పొడిలో అలోవెరా జెల్ కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. దీనిని ముఖానికి అప్లై చేసినట్టయితే స్కిన్ టైట్ అవుతుంది. దీనికోసం మీరు వాడే గంధం నేచురల్‌ది మాత్రమే తీసుకోవాలి.
బియ్యం పిండిలో నిమ్మరసం, అలోవెరా జెల్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మెరుస్తుంది.
గ్రీన్ టీలో కలబందను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
క్రమం తప్పకుండా కొద్దిగా కలబంద జెల్‌ను ముఖానికి పూయడం వల్ల మొటిమలు, తామర, సన్ బర్న్ సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.