తలస్నానానికి షాంపూ వదిలేయండి.. వీటిని కూడా వాడొచ్చు!
22 August 2023
తలస్నానం చెయ్యాలంటే ఎప్పుడూ షాంపూనే ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా షాంపుల్లోని హనితలపెట్టే రసాయనాలు కురులు రాలిపోయేలా చేస్తాయి
మరైతే షాంపూకి ప్రత్నామ్నాయంగా ఏది ఉపయోగించాలని అనుకుంటున్నారా..? మన ఆయుర్వేదంలో అందుకు చక్కని చిట్కాలున్నాయి. ఇవి కురులు ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తాయి
కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా ఎదగాలంటే ఓసారి ఈ ప్రత్యామ్నాయాలు వాడి చూడండి. ఇంకెప్పుడూ షాంపూ జోలికి వెళ్లలేరు. అవేంటో తెలుసుకుందాం..
కుంకుడుకాయల్ని అరగంట సేపు వేడినీళ్లల్లో నానబెట్టి రసం తీసేయాలి. ఆ రసంలో చెంచా కలబంద గుజ్జు, నిమ్మబద్ద సగం కలిపి తలస్నానం చేస్తే జుట్టు సమస్యలన్నీ పరార్
ఈ విధంగా తయారు చేసిన కుంకుడు రసంతో తల స్నానం చేస్తే దీనిలో ఉండే ఔషధగుణాలు మాడుపై పేరుకుపోయిన మురికి తొలగించడంతో పాటు చుండ్రు, దురద వంటి సమస్యలు తొలగిపోతాయి
కలబంద గుజ్జును కూడా తల స్నానానికి ఉపయోగించవచ్చు. కలబంద రసాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి
ఇలా చేయడం వల్ల సహజపద్ధతిలో తలలో పేరుకుపోయిన మురికి పోగొట్టడమే కాకుండా కురులకు పోషకాలు సంమృద్ధిగా అంది.. ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది
వేడినీళ్లలో గుప్పెడు వేప ఆకులు వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లను చల్లార్చి వడకట్టాలి. ఇలా తీసిన రసాన్ని తలలో మాడు నుంచి కురుళ్ల చివర వరకూ పట్టించి కాసేపు అలాగే ఉండనివ్వాలి
గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తే క్రమంగా తలలో చుండ్రుని తగ్గించడమే కాకుండా శిరోజాలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి