యోగా చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..ఈ యేడు థీమ్ ఇదే!

Jyothi Gadda

21 June 2024

యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషుల ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు.

ప్రతిరోజూ యోగా చేస్తే శరీరానికి, మనసుకి చాలా మంచిది. ఇది శరీరాన్ని బలంగా చేయడమే కాకుండా చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. యోగాతో మనసుకి ఆనందం కలుగుతుంది. ఇది శరీరాన్ని బలంగా చేయడమే కాకుండా అనేక సమస్యల్ని దూరం చేస్తుంది.

హైబీపి కారణంగా చాలా సమస్యలొస్తున్నాయి. యోగా హైబీపిని తగ్గిస్తుంది. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. దీనికోసం పశ్చిమోత్తాసనం, శవాసన, ప్రాణాయామం, అధోముఖ స్వనాశనాలు చేయొచ్చు.

షుగర్‌ వ్యాధికి ట్రీట్‌మెంట్ లేదు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా సమస్యని తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెరని తగ్గించుకునేందుకు కపాలాభాతి, ధనురాసనం, చక్రాసనంలు హెల్ప్ చేస్తాయి.

ఆస్తమా ఉన్నవారికి యోగా మంచి ట్రీట్‌మెంట్. యోగాతో శ్వాస సమస్య తగ్గుతుంది. ఊపిరితిత్తులకి స్వచ్ఛమైన గాలి సరఫరా చేయడానికి యోగా హెల్ప్ చేస్తుంది. ఇది శ్వాసలోపం నుండి ఉపశమనం పొందుతుంది. ఉబ్బం, శ్వాస సమస్యల్ని నివారిస్తుంది.

యోగా చేస్తే ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి. యోగా చేస్తే బరువు తగ్గుతారు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి తాడాసనా, త్రికోణాసనం, పాదహాసనం, పార్శ్వకోనాసనం చేయడం మంచిది.

బ్రెయిన్‌లో రక్తప్రసరణ సరిగా లేకుంటే మైగ్రేన్ సమస్య వస్తుంది. ఇది తీవ్ర తలనొప్పి. యోగా సాయంతో బ్రెయిన్‌కి రక్తం ఈజీగా చేరుతుంది. దీంతో మైండ్ ఫ్రెష్‌గా మారుతుంది. మైగ్రేన్‌లో శీర్షాసనం, ఉత్తరాసనం, బాలాసనం, శవాసనాలతో ప్రయోజనం

2024సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న థీమ్ ను తీసుకున్నారు. అంటే యోగ మన కోసం, మన సొసైటీ కోసం అన్న థీమ్ తో యోగాపై అవగాహన కల్పించారు.