యోగాతో  ఆ వ్యాధికి చెక్‌.. 

25 November 2023

ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుత సాధనం యోగా. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న యోగాను భారతీయులు తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు. 

మనసును, శరీరాన్ని ఏకం చేసే ఈ అద్భుత సాధనంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యోగాతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న ఎన్నో దేశాలు ప్రస్తుతం యోగాను ఆచరిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగా దినోత్సవం జరపడపే దీనికి నిదర్శనం. 

ఇదిలా ఉంటే యోగాతో కలిగే ప్రయోజనాల గురించి పరిశోధకులు ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ విషయమే వెలుగులోకి వచ్చింది.

యోగా చేయడం వల్ల మూర్ఛ వ్యాధి లక్షణాలు తగ్గుతున్నట్లు పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఢిల్లీ చెందిన ఎయిమ్స్‌ న్యూరో విభాగం నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇదేదో అషామాషీగా చెబుతోంది కాదు. అధ్యయనం చేసి మరీ తెలిపారు. 

తరచూ మూర్ఛపోవడం, అపనింద భావనకు గురికావడం, వ్యాకులత వంటివి యోగా వల్ల నియంత్రణలోకి వస్తున్నాయని న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌ డాక్టర్‌ మంజతి త్రిపాఠీ తెలిపారు.

‘న్యూరాలజీ’ జర్నల్‌లో అధ్యయానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా 160 మంది మూర్ఛ బాధితులను ఎంచుకున్నారు.