ఎరుపు రంగులో.. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్న ఈ ద్రాక్ష పండ్ల గుత్తులు చూస్తుంటే.. ధర మహా అయితే కేజీ రూ. 60 నుంచి 100 లోపే ఉంటుందని భావిస్తే తప్పులో కాలేసినట్లే
ఎందుకంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షపండ్లు. వీటిని జపాన్‌లోనే పండిస్తారు. వీటిని రూబీ రోమన్ ద్రాక్ష అంటారు. ప్రతియేట జూలైలో హార్వెస్టింగ్ మొదలవుతుంది
వీటి ధర ఒక గెల అక్షరాల రూ.8 లక్షలు. బాబోయ్ ఎందుకింత ధర అని నోరెళ్లబెట్టకండి.. ఎందుకంటే రూబీ రోమన్ ద్రాక్ష సాదారణ ద్రాక్ష కంటే నాలుగు రెట్లు రుచి, నాణ్యత ఎక్కువ. ఇక కేజీ ఇంకెంత ధర పలుకుతుందో..?
ఈ జాతికి చెందిన ద్రాక్షలు ముదురు ఎరుపులో కెంపుల్లా ధగధగలాడుతూ ఉంటాయి. 2020లో జరిగిన వేలంపాటలో ఒక్క రూబీ రోమన్ ద్రాక్ష గుత్తి ధర 12,000 డాలర్ల (రూ.9.76 లక్షలు) పలికిందట
అంటే ఒక్కో ద్రాక్ష పండు సుమారు రూ.30 వేల వరకు పలికింది. ఒక్క గుత్తిలో దాదాపు ముప్పయి పండ్ల వరకు ఉంటాయి. వీటిలో అత్యుత్తమమైన ద్రాక్షలను ప్రత్యేకంగా ఏరి.. యేటా వేలం వేస్తుంటారు
దేశ దేశాలకు చెందిన వర్తకులు ఈ వేలంలో పాల్గొంటారు. 2020లో జపాన్‌లోని అమగసాకి సూపర్ మార్కెట్‌లో జరిగిన వేలంలో రుబీ రోమన్ ద్రాక్షకు అత్యధిక ధర పలికింది
ఇంతటి ఖరీదైన ద్రాక్ష పండ్లను జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్ అనే ప్రాంతంలో పండిస్తారు. వీటిని ధనవంతులు తమకు అత్యంత ఇష్టమైన వారికి బహుతులుగా ఇస్తుంటారు
రూబీ ద్రాక్షలో మాంసం కంటే ఎక్కువగా ఐరస్, క్యారట్ల కంటే ఎక్కువగా బీటాకెరోటిన్, నారింజల కంటే ఎక్కువగా విటమిన్ సీ ఉంటాయట