గోవాలో ఇక ‘వర్క్ ఫ్రమ్ బీచ్’..
TV9 Telugu
25 March 2024
చాలామంది వేసవిలో గోవా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక్కడ బీచ్, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేదతీరుతారు పర్యాటకులు.
అందమైన బీచ్‌లు.. సాహసోపేత జలక్రీడలకు గోవా ప్రసిద్ధి. దేశవిదేశాల నుంచి ఏటా పెద్ద ఎత్తున పర్యటకులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు.
అయితే.. ఆఫీసు పనుల కారణంగా కొంతమంది ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారినీ రప్పించేందుకు గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇక్కడి బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
ప్రజలు గోవాకు రావచ్చు.. విశ్రాంతి తీసుకోవచ్చు.. ఆఫీసు పని కూడా చేసుకోవచ్చు. ఈ దిశగా ‘డిజిటల్ నోమాడ్’ విధానం తీసుకొచ్చారు.
స్థానికంగా ప్రతి గ్రామం డిజిటల్‌గా అనుసంధానమై ఉందనీ పనాజీలో ఇంటింటికీ ఫైబర్ నెట్ సదుపాయం త్వరలో పూర్తి కానుందనీ తెలిపారు.
దీని ద్వారా పర్యాటకులు గోవా నుంచే ఆఫీసు పని చేసుకోవచ్చుననీ దీనికి తగిన వాతావరణం కల్పిస్తామని వివరించారు.
స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. మిరామర్ బీచ్‌లో సముద్ర హారతిని ప్రారంభించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి