చలికాలంలో చెర్రీలను తింటే ఏమవుతుందో తెలుసా.?

Jyothi Gadda

07 December 2024

TV9 Telugu

చలికాలంలో చెర్రీలను తినటం ఎంతో ప్రయోజనం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు చెర్రీలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

TV9 Telugu

చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లు,  ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రుచిలో కాస్త తీయగా, పుల్లగా ఉండే చెర్రీల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం దాగున్నాయి.

TV9 Telugu

చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

TV9 Telugu

చెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే, ఇది గౌట్ లక్షణాలను తగ్గిస్తుంది. చెర్రీస్ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

TV9 Telugu

చెర్రీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇవి మంచి టేస్ట్‌తో పాటు చూడటానికి కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయి. చెర్రీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చెర్రీలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి.

TV9 Telugu

వివిధ రకాల విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ పండ్లను రెగ్యులర్‌గా తింటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu

చెర్రీస్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ కాస్త చెర్రీలు తింటే రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. 

TV9 Telugu

క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు మంచిది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చెర్రీలను డైట్ లో చేర్చుకుంటే ఉత్తమ ఫలితాలను పొందుతారు.

TV9 Telugu