భోజనం తర్వాత మజ్జిగ తాగుతున్నారా..? ఇది తెలుసుకోండి
Jyothi Gadda
01 October 2024
మజ్జిగలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందుకే మజ్జిగను రోజూ తినే ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆయుష్యు పెరుగుతుంది.
మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. కొవ్వులు తక్కువగా ఉన్న బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది.
లాక్టిక్ యాసిడ్ అనే ఈ బ్యాక్టీరియా మనుషుల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బటర్ మిల్క్‌లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది.
మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఎముకలు బలపడతాయి. స్త్రీలు రుతుక్రమం తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో మరీ మంచిది.
అయితే మజ్జిగ ఎలా తయారు చేసినా దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటారు. ఆహారంతో పాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.
మజ్జిగ కేవలం చలవ చేయడం మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని.. బరువు తగ్గడంలో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది శరీరంపై ప్రత్యేకించి జీర్ణవ్యవస్థపై శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది, యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా కడుపు లైనింగ్‌లో ఏర్పడే చికాకును తగ్గిస్తుంది.