11 June 2024

మహిళలూ.. ఈ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా.? 

Narender.Vaitla

మహిళలల్లో సాధారణంగా కనిపించే సమస్యల్లో ఐరన్‌ లోపం ఒకటి. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, విత్తనాలు, పండ్లను భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

నెలసరి సమయంలో మహిళలు మానసికంగా కూడా పలు ఒత్తిడులు ఎదుర్కొంటారు. అందుకే తీసుకునే ఆహారంలో మాంసం, చీజ్‌, పాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక స్త్రీలలో ఎక్కువగా చ్చే మూడ్‌ స్వింగ్స్‌ సమస్యకు చెక్‌ పెట్టడంలో విటమిన్‌ బి12 ఉపయోగపడుతుంది. ఇందుకోసం బాదంపప్పు, గుడ్లు, పుట్ట గొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలి.

మహిళల జుట్టు, చర్మం అందంగా ఉండాలని కోరుకుంటారు. వీటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో బాదం పప్పు, తృణధాన్యాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక మెరుగైన జీర్ణక్రియకు బయోటిన్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం అరటిపండ్లు, బ్రకోలీ, గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

30 ఏళ్లు దాటిన స్త్రీలలో కాల్షియం లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బచ్చలికూర, పాలు, చియా గింజలు, సోయాబీన్స్‌ను తీసుకోవాలి.

ఈ మధ్య కాలంలో మహిళల్లో ఎక్కువగా విటమిన్‌ డీ లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు మాంసం, చేపలు, గుడ్లు, నారింజను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఉదయం కాసేపు సూర్య రక్ష్మి తగిలేలా చూసుకోవాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.