బప్రస్తుతం అందరూ చిరుధ్యాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని తింటున్నారు. ఐతే వీటిని మితంగానే తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు
సోషల్ మీడియాలో, యూట్యూబ్ వంటి సామాజిక మాద్యమాల్లో రకరకాల విత్తనాలు డైట్‌లో ఏవిధంగా చేర్చుకోవాలో చెబుతుంటారు. ఐతే తినడం మంచిదే
కానీ అతిగా తీసుకోవడమే ఆరోగ్యానికి అనర్థంగా పరణమిస్తుంది. ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల చిరుధాన్యాలు అతిగా తీసుకుంటే హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుని తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుందట
అవిసె గింజనలను మహిళలు ఆహారంలో భాగంగా తీసుకుంటే నెలసరి సమస్యలు, అధిక బరువు, గర్భధారణ సమస్యల్ని దూరం చేయడంలో సహాయపడుతాయి
అయితే వీటిని ఒక టేబుల్ స్పూనుకి మించి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అతిగా తింటే వీటిల్లో ఉండే సయానోజెనిక్ గైకోసైడ్స్ శరీరంలోని మెటబాలిజంను దెబ్బతీస్తాయి
అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిలోని ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మేలు చేసినా మోతాదు మించితే రక్తపోటుకీ దారితీస్తుంది
కౌమారదశలోకి అడుగు పెట్టిన అమ్మాయిలు నువ్వులు తింటే మంచిదని చెబుతుంటారు. నువ్వుల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఐతే వీటిని రోజూ ఒకటిన్నర స్పూను మాత్రమే తీసుకోవాలి