బావిలో పాములతో 54 గంటలు ఉన్న మహిళ..! చివరికి ఏం జరిగిందంటే.?
30 September 2025
Prudvi Battula
చైనాలోని ఫూయాన్ ప్రావిన్సు క్వాన్జో సమీప అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన బావిలో పడిన 48 ఏళ్ల క్విన్ అనే మహిళ ప్రమాదవశాత్తు పడిపోయింది.
ఈ బావిలో నీటి పాములు చాల ఉన్నాయి. వాటి నుంచి తనను తాను రక్షించుకొంటూ 54 గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపింది.
ఆ మహిళకు ఈత రావడంతో నీటిలో మునిగిపోకుండా బావిలో ఉన్న గోడలను గట్టిగ పట్టుకొని కష్టం మీద నిలబడగలిగింది.
క్విన్ ఆచూకీ కోసం ఆమె ఫ్యామిలీ ఫిర్యాదు చేయగా, అధికారులు డ్రోన్ సాయంతో గాలింపుతో ఆమె బావిలో పడినట్టు గుర్తించారు.
రెండు రోజుల తర్వాత ఆమె ఆచూకీని తెలుసుకున్న అధికారులు బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. దీంతో ప్రాణాలతో బయటపడింది.
ఆమెకు బయటికి తీసిన తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాలతో బయటపడటంతో కుటుంబం సంతోషం వ్యక్తం చేసారు.
రెండు రోజులు బిక్కు బిక్కుమంటూ మరణాన్ని జయించిన తర్వాత ఆమె మాట్లాడుతూ బావిలో ఆమె పడ్డ బాధను పంచుకుంది.
‘‘బావిలో చాలాసార్లు తీవ్ర నిస్పృహకు గురయ్యాను. ముసలివాళ్లయిన నా తల్లిదండ్రులు, ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళుతున్న నా కుమార్తె గుర్తుకొచ్చి ధైర్యం కూడదీసుకున్నా’’ అని క్విన్ తెలిపింది.