మెనోపాజ్‌ దశలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

7 August 2023

Pic credit - Pexels

స్త్రీలలో పునరుత్పత్తి ఆగిపోయిందనడానికి మెనోపాజ్‌ ఓ సంకేతం

మెనోపాజ్‌ ప్రారంభానికి కొన్ని నెలల ముందే మహిళల శరీరంలో మార్పులు మొదలవుతాయి

హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ఈస్ట్రోజన్‌ స్థాయి తగ్గడం వంటి లక్షణాలు

అలాగే క్యాల్షియం, డి విటమిన్‌ లోపాలు ఏర్పడి ఎముకలు బలహీన పడటం వంటి మార్పులు వస్తాయి

మెనోపాజ్‌ దగ్గరపడ్డాక ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు

ఎముకలు బలహీనపడకుండా ఉండాలంటే క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి

మెనోపాజ్‌ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో 1200 మిల్లీగ్రాముల క్యాల్షియంను తప్పనిసరిగా తీసుకోవాలి

ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి

విటమిన్‌ డి అధికంగా ఉండే గుడ్లు, చేపలు, పుట్టగొడుగులుతోపాట రోజూ ఉదయం, సాయత్రం వేళల్లో శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి