చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా ప్రబలుతుంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంతో వీటి బారిన పడకుండా ఉండొచ్చంటున్నారు నిపుణులు
ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా రోగాలను ఎదుర్కోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వింటర్ సూపర్ ఫుడ్స్‌తో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవచ్చు
వర్షాకాలంలో దొరికే దుంపకూరల్లో ఎర్ర ముల్లంగి ఒకటి. రుచికి కొంచెం వెగటుగా ఉన్నా ఆరోగ్యానికి మాత్రం ఎన్నో లాభాలు చేకూరుస్తుంది
గిగా పిలిచే టర్నిప్స్‌లో పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉంటాయి
వింటర గేమ్ ఛేంజర్‌గా ఎర్ర ముల్లింగిని చెబుతుంటారు. ఈ దుంపలు విటమిన్ సీ, విటమిన్ కేతో మన రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తాయి
అలాగే ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు కూడా చక్కగా పనిచేస్తాయి. అందువల్లనే చాలామంది కూర, చారు, పచ్చడి, సలాడ్ వంటి వాటిల్లో ముల్లంగిని చేర్చుకుంటారు
ముల్లంగితో కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యాన్ని కాపడుతుంది. ఎర్ర రక్తకణాలను కూడా వృద్ధి చేస్తుంది
రక్తానికి ఆక్సిజన్ అందించి, బీపీని అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ఒంట్లో చేరిన మలినాలను తొలగిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది