శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే గింజలు!
15 December 2023
వాతావరణ ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. చలి కాలంలో సాధారణంగా చలి వల్ల మనకు చాలా బద్ధకంగా ఉంటుంది. ఏమీ తినాలనిపించదు..
వెచ్చగా దుప్పటి కప్పుకొని అలా ఉండిపోతే చాలనిపిస్తుంది. దాదాపు అందరికీ ఇలాగే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలూ పలకరిస్తాయి
అయితే శీతాకాలంలో చలిని పారదోలి వెచ్చదనంతోపాటు ఒంటికి చురుకుదనాన్నీ అందించే ఆహారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
ముఖ్యంగా శీతాకాలంలో వాల్‌నట్స్ తిరడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందట. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒంట్లో చురుకుదనాన్ని అందిస్తాయి
అంతేకాకుండా వాల్‌నట్స్ తిరడం వల్ల చర్మానికి తగిన తేమ, మెరుపు అందుతాయి. మెదడు పని తీరునీ మెరుగు పరుస్తాయని నిపుణులు అంటున్నారు
వేరుశనగ పప్పుల్లో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ, దీర్ఘకాలిక శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.
వేరుశనగ పప్పులు రోజుకి గుప్పెడు తింటే ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. అమ్మాయిలకి చలికాలంలో నెలసరి సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి
వేరుశనగ పప్పుతోపాటు, బాదం, గుమ్మడి .. వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మెగ్నీషియం, విటమిన్ ఇ, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి,శరీరానికి వెచ్చగా ఉంచుతాయి
ఇక్కడ క్లిక్ చేయండి