బైక్ సైడ్ స్టాండ్‎లో ఉంచితే త్వరగా పాడవుతుందా.?

01 August 2025

Prudvi Battula 

సైడ్ స్టాండ్ సరిగ్గా సర్దుబాటు చేయకపోతే అంటే టైర్ వైపు నేలను తాకినప్పుడు టైర్స్ త్వరగా అరిగిపోయి కొన్నిసార్లు ప్రమాదాలకు దారి తీస్తుంది.

సైడ్ స్టాండ్‌లు బైక్‌ను తక్కువ స్థిరంగా ఉంచుతాయి. ముఖ్యంగా జారుడు ప్రదేశాల్లో అది బోల్తా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సైడ్ స్టాండ్ అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అంటే బైక్ బరువు అంత స్టాండ్‎పై పడేలా చేస్తుంది. దీంతో స్టాండ్ త్వరగా విరిగిపోతుంది.

సైడ్ స్టాండ్‎పై ఎక్కువ ఉంచితే బైక్ మైలేజ్‎పై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే పెట్రోల్ లీక్‎కి కారణం అవుతుంది.

తరచూ సెంటర్ స్టాండ్‌ను ఉపయోగించండి. ఇది బైక్ స్థిరత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.

మీ బైక్‌ను చదునైన ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు మాత్రమే సైడ్ స్టాండ్ బైక్ బరువును సమానంగా మోయగలదని నిర్ధారించుకొండి.

టైర్లలో అరుగుదల నివారించడానికి సైడ్ స్టాండ్ సరిగ్గా ఉంచడం ముఖ్యం. బైక్‌ను ఎక్కువగా సెంటర్ స్టాండ్‌లో ఉంచడం మంచిది.

మీ సైడ్ స్టాండ్ స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మర్చిపోవద్దు. ఇది సరిగ్గా లేకుండా సెంటర్ స్టాండ్ మాత్రమే వాడండి.