ప్రతి రోజు సంభోగంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా !!

Phani CH

24 October 2024

ఈ విశ్వంలో అన్ని జీవరాశులతో పోల్చితే మానవులకు అనేక అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా  బుద్ధి., జ్ఞాపక శక్తి.

మన దిన చర్యల దగ్గర నుండి మనం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం. అలాంటి జ్ఞాపక శక్తి పెరగాలంటే స్త్రీ, పురుషుల సాంగత్యం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు నిపుణులు .

అయితే కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీలో స్త్రీ- పురుష సాంగత్యం, జ్ఞాపకశక్తి పై మహిళల ఆరోగ్యంపై అనేక పరిశోధనలు జరిపి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసారు.

తరచుగా పురుషుడితో సంభోగం చేసిన స్త్రీలపై అధ్యయనం చేయగ ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలు అందరిని షాక్ కు గురి చేశాయి.

తరచూ పురుషుని తో సంబోగించే యువతులు .. ఆ పురుషుని యొక్క ముఖం కంటే వారు చెప్పే రొమాంటిక్ పదాలను గుర్తుంచుకోవడం సులభం అని ఫలితాలు వచ్చాయి.

స్త్రీ- పురుష సంభోగం సమయంలో ఉండే ఫ్రీక్వెన్సీ జ్ఞపక శక్తి పెరగడానికి సహాయపడుతుందని కనుగొన్నారు నిపుణులు.

సంభోగం వ్యాయామం యొక్క మరొక రూపం అంటున్నారు నిపుణులు. అందుకే స్త్రీ పురుషుల కలయిక జ్ఞాపకశక్తి., నూతన విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. 

తరచుగా సంభోగం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన. డిప్రెషన్‌ల లక్షణాలు తగ్గుతాయట. తద్వారా హిప్పోకాంపస్‌లో పెరిగిన న్యూరోజెనిసిస్ కారణంగా ఎక్కువ మెదడు కణాలు పెరిగి, మెరుగైన జ్ఞాపకశక్తి వస్తుందట.