నిద్రపోయే ముందు అందుకే ముఖం కడుక్కోవాలి

18 September 2023

మెరిసే, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే అందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవాలి

చర్మ సంరక్షణకు ముఖ్యమైన నియమం చర్మాన్ని శుభ్రపరచడం. ఎందుకంటే చర్మాన్ని రెగ్యులర్‌గా క్లీన్ చేయడం వల్ల చర్మంపై మురికి పేరుకుపోకుండా ఉంటుంది

రోజంతా ముఖం శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రాత్రి పడుకునే ముందు కూడా మరోమారు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా అవసరం

రాత్రిపూట ముఖం శుభ్రం చేసుకోకపోతే మోటిమలు, ముఖంపై ముడతల సమస్య త్వరగా తలెత్తుతుంది అందుకే రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం చాలా ముఖ్యం

ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరచడమేకాకుండా చర్మానికి ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఫలితంగా ముఖం ఎల్లప్పుడు తాజా మెరిసిపోతుంటుంది

చాలా మంది రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకోకుండా మేకప్ వేసుకుని ఆలాగే నిద్రపోతుంటారు. దీని వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి 

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని సబ్బు లేదా ఫేస్‌ వాష్‌తో శుభ్రంగా కడుక్కుంటే స్కిన్ టోనింగ్ సమస్య ఉండదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు

రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని కొల్లాజెన్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఫలితంగా ముడతల సమస్య తలెత్తదు.